ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్న అలియా & డైసీ

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరగనున్నట్లు సమాచారం ఐతే ఈ షెడ్యూల్లో హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ తోపాటు అందాల ముద్దుగుమ్మలు అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారు అట.

‘బాహుబలి’ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళిపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మన రాజమౌళి.

తాజా సమాచారం ప్రకారం సీనియర్ హీరో సంజయ్ దత్, యువ కథానాయకుడు వరుణ్ ధావన్ లకు కూడా సినిమాలో బలమైన పాత్రలు తీర్చిదిద్దాడట జక్కన్న. సంజయ్ దత్, వరుణ్ ధావన్‌ల విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. 350 కోట్లకు పైగా బడ్జెట్లో నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.