లేట్ అయినా పర్లేదు తగ్గేదే లేదు…

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న కారణంగా థియేటర్స్ క్లోజ్ అయ్యాయి, షూటింగ్స్ క్లోజ్ అయ్యాయి. దాదాపు అన్ని సినిమా పనులు ఆగిపోయాయి. ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, మళ్లీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు కాబట్టి భారీ బడ్జట్ పెట్టి నిర్మించిన సినిమాలు చాలా వరకూ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే కొందరు మేకర్స్ మాత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఎంత మంచి ఆఫర్ వచ్చిన థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి.

ఈ లిస్ట్ లోకి వచ్చిన మొదటి సినిమా దగ్గుబాటి రానా నటించిన ‘విరాటపర్వం’. సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ రెవెల్యూషనరీ లవ్ స్టోరీని వేణు అడుగుల తెరకెక్కించాడు. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన విరాటపర్వం సినిమాని మేకర్స్ ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్‌పోన్ చేశారు. కంటెంట్ అండ్ స్టార్ కాస్ట్ రెండూ ఉండడంతో ఓటీటీలో రిలీజ్ కి భారీ ఆఫర్స్ వచ్చాయి. విరాటపర్వం ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనే వార్త సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టడంతో మేకర్స్ అవన్నీ నిజం కాదని, ‘విరాటపర్వం’ థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు.