డి కంపెనీ బాంగ్ బాంగ్… రక్త చరిత్రని గుర్తు చేస్తుంది

సెన్సేషన్ ని ఇంటి పేరుగా మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ డి కంపెనీ. తనకి బాగా పట్టుకున్న అండర్ వరల్డ్ పైన చాలా రోజుల తర్వాత సినిమా చేసిన ఆర్జీవీ, వీలైనంత ఎక్కువగా దీని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ట్రైలర్ తో వర్మ అనుకున్న బజ్ క్రియేట్ అయ్యింది, 4 నిమిషాల క్లిప్ తో ఆ బజ్ ని మరింత పెంచాడు. ఇప్పుడు ఈ మూవీ నుంచి బాంగ్ బాంగ్ అనే సాంగ్ ని రిలీస్ చేశాడు. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో అనే మెసేజ్ తో వచ్చిన ఈ సాంగ్ లో వర్మ చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.

రాయలసీమ ఫ్యాక్షనిజంతో వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ రక్త చరిత్రని గుర్తు చేసేలా ఈ సాంగ్ విజువల్స్ ఉన్నాయి. నిజానికి రాముకి ఆ స్థాయి హిట్ అంది కూడా చాలా కాలమే అయ్యింది. మరి ఈ ట్రేడ్ మార్క్ అండర్ వరల్డ్ మూవీతో వర్మ తన అభిమానులని మెప్పిస్తాడేమో చూడాలి. స్పార్క్ ఓటీటీలో డి కంపెనీ ఈరోజు రాత్రి నుంచి స్ట్రీమ్ కానుంది చూసి వర్మ మార్క్ ఉందో లేదో చెప్పడానికి నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు.