జూనియర్ ఎన్టీఆర్ కి గాయం.. డాక్టర్లు కూడా భయపడ్డారు

ఆది సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఎన్నో మధుర జ్ఞాపకాలతో పాటు అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం కూడా చోటు చేసుకున్నట్లు ఇటీవల అలీతో సరదాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివి.వినాయక్ వివరణ ఇచ్చారు. తారక్ మణికట్టుకు అయిన కత్తి గాయం అందరిని షాక్ కి గురి చేసినట్లు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ.. ఆది సినిమా షూటింగ్ లో ఒక ఎమోషనల్ సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు ఒక కత్తి తారక్ చేతికి తగిలింది. అనుకోకుండా మణికట్టు వద్దే గాయం కావడంతో రక్తం ఆగకుండా కారుతూనే ఉంది. వెంటనే హాస్పిటల్ కి తీలుకువెళ్లగా ఆ గాయం చూసిన డాక్టర్లు భయపడ్డారు. అక్కడ సున్నితమైన నరం ఉంటుందని ఏమైనా తేడా వస్తే మా ప్రాణాలు పోతాయి అంటూ కంగారు పడ్డారు. నిజంగా అప్పట్లో ఆ విషయం చాలా భయాన్ని కలిగించింది. ఇప్పటికి తారక్ చేతికి ఆ గాయం గుర్తు ఉంటుంది.. అని వినాయక్ వివరణ ఇచ్చారు.