అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం.. బిగ్ బాస్ హౌజ్ సమీపంలో..

అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణా స్టూడియోలో శుక్రవారం అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అందరూ షాక్ అయ్యారు
వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఒక్కసారిగా భయానికి గురి చేసిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం తెలిపింది.

షూటింగ్‌ కోసం వేసిన ఒక స్పెషల్ స్వట్ సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ వలనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు వివరణ ఇచ్చారు. ఇక ప్రమాదం జరిగిన సమీపంలోనే బిగ్ బాస్ హౌజ్ ఉండడంతో ఏమైనా ప్రమాదం అక్కడ కూడా సంభవించిందా అనే అనుమానాలు రాగా వెంటనే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఘటనపై వివరణ ఇచ్చారు. హౌజ్ కి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అన్నారు. ఇక ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని స్టూడియో నిర్వాహకులు వెల్లడించారు.