విజయ్ vs విజయ్ సేతుపతి

ఇప్పటికే సైరా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళంలో వరసగా హీరోగా సినిమాలు చేస్తూనే విజయ్ సేతుపతి ఇతర భాషల్లో నటించడం గొప్ప విషయం. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పాత్ర నచ్చితే గెస్ట్ రోల్ చేయడానికి ఇష్టపడే విజయ్, పేట సినిమాలో తలైవా పక్కన కనిపించాడు. తలైవా అయిపోయాడు కదా అనుకున్నాడో ఏమో కానీ మక్కల్ సెల్వన్ ఇప్పుడు ఇలాయదలపతి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తలపతి విజయ్ ప్రస్తుతం బిగిల్ చిత్రం పూర్తి చేసేపనిలో బిజీగా ఉన్నారు. ఇది అయ్యాక విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ 64వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. విజయ్ తో నటించడం సంతోషంగా ఉందని సేతుపతి కూడా ట్వీట్ చేయడంతో ఈ కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. మరి విజయ్ vs విజయ్ సేతుపతి ఆన్ స్క్రీన్ ఫైట్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.