సైరాపై కలెక్షన్ కింగ్ కామెంట్స్

రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నసైరా సినిమాపై మెగాస్టార్ చిరంజీవి చిరకాల మిత్రుడు, డైలాగ్ కింగ్… కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్వీట్ లో మోహన్ బాబు ‘నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. టీమ్ మొత్తానికి బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ పోస్ట్ చేశారు. మోహన్ బాబు ట్వీట్ చూసిన మెగా అభిమానులు సంతోషంతో థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మోహన్ బాబు కానీ మంచు ఫ్యామిలీ కానీ సినిమాకి సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు, ఎప్పుడు ఏ మంచి సినిమా వచ్చినా మంచు ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఆ సినిమా గురించి ట్వీట్స్ చేసి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మంచి మనోజ్ ఈ విషయంలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతే యాక్టివ్ గా ఉండే మనోజ్ సినిమాలకి దూరం అయ్యి చాలా రోజులు అయ్యింది, మనోజ్ కంబ్యాక్ కోసం మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మనోజ్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో చూడాలి.