విజయ్ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనేనా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై విజయ్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కిస్తున్నారు.

VIJAY

అయితే తాజాగా విజయ్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చింది. తాజాగా డైరెక్టర్ అట్లీని విజయ్ కలిశాడు. అట్లీ ఆఫీస్‌కు తన సెక్యూరిటీతో విజయ్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అట్లీతో విజయ్ తన తర్వాతి సినమాను చేయున్నాడనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు విజయ్ తన తర్వాతి సినిమాను పా రంజీత్ డైరెక్షన్‌లో చేయున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి త్వరలో విజయ్ తర్వాతి సినిమాపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం మాస్టర్ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతన్నాయి