సంక్రాంతికి రానున్న ‘టక్ జగదీష్’

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్ర పోషించిన ‘V’సినిమా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే అందులో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ నాని చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ కథతో ‘V’సినిమా తెరకెక్కగా.. కారణం ఏంటో గానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం నటిస్తున్న టక్ జగదీష్ సినిమాపై నాని ఆశలు పెట్టుకున్నాడు.

NANI

ఈ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా.. ఈ చివరి షెడ్యూల్ షూటింగ్‌లో సినిమాలోని నటీనటులందరూ పాల్గొంటున్నారు. ఇది నాని నటిస్తున్న 26వ సినిమా కాగా.. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జగబతిబాబు, రావు రమేష్, నరేష్, నాజర్ లాంటి సీనియర్ నటులు ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నారు. V సినిమా ప్లాప్‌తో నిరాశలో ఉన్న నాని టక్ జగదీష్ సినిమాపై అంచనాలు పెట్టుకున్నాడు.