గెట్ రెడీ.. ‘మాస్టర్’ వచ్చేస్తున్నాడు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గెట్ రెడీ అంటున్నాడు. విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ సినిమా గురించి ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్స్‌లో ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేయగా.. ఈ సినిమాను రూ.100 కోట్లు పెట్టి నెట్‌ఫిక్స్ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. విజయ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉంది. తెలుగులోనూ విజయ్ డబ్బింగ్ సినిమాలు విజయం సాధించాయి.

VIJAY

సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఓటీటీలో విడుదల చేస్తారా లేదా థియేటర్‌లో విడుదల చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. థియేటర్లలో 50 సీటింగ్ సామర్థ్యం అయితే సినిమాకు నష్టాలు వచ్చే అవకాశముందని, 75 శాతం సీటింగ్ సామర్థ్యంకు అవకాశం ఇస్తే థియేటర్లలో ఓపెన్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

విజయ్ మార్కెట్ రేంజ్‌ను బట్టి చూస్తే ఫస్ట్ వీక్‌లో రూ.100 కోట్ల కలెక్షన్ వచ్చే అవకాశముంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందుల మాళవిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. ఇటీవలే విడుదలైన మాస్టర్ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సంపాదించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. విజయ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.