రైతులతో పెట్టుకుంటే మాడిపోతావ్

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యంమంకు ప్రతిఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమం చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రైతులను కొట్టడం ఏంటీ అని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో వంద రూపాయలకే ఆశపడి పాల్గొంటున్నవారే ఎక్కువమంది ఉన్నారని కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

KANGANA

కంగనాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు, సింగర్ దిల్జత్ కంగనాపై మండిపడ్డారు. రైతులతో పెట్టుకున్నా కంగనా.. జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. దిల్జత్ ట్వీట్‌పై కంగనా స్పందించింది. దిల్జిత్ కరణ్ పెంపుడు జంతువు అని, షాహీన్‌ బాగ్‌లో తన పౌరసత్వం కోసం నిరసన చేసిన దాదీ.. ఇప్పుడు రైతులు కనీస మద్దతు ధర కోసం చేస్తోన్న ఆందోళనలో కేవలం వంద రూపాయల కోసం వచ్చి కూర్చున్నది అని ఆరోపించింది.

రైతుల ఉద్యమంను కించపరుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బీజేపీ, మోదీ మీద భక్తి ఉంటే కంగనా మరోలా ప్రదర్శించాలని,ఇలా రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు. కంగనా ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. కంగనా చేసిన వ్యాఖ్యలపై ప్రజలతో పాటు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.