పూరీ జగన్నాథ్ అరుదైన రికార్డు

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. మాస్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన ఆయన.. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా ఒకటి, రెండు సినిమాలు తీశారు. ప్రస్తుతం టాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిన పూరీ.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా పూరీ జగన్నాథ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

puri jaganadh

పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప్రతి అంశంపై పూరీ జగన్నాథ్ తన అభిప్రాయాలను చెబుతున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలను తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పూరీ అప్‌లోడ్ చేస్తున్నాడు. ప్రతి అంశంపై పూరీ చెప్పే మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన అభిప్రాయాలను పూరీ ముక్కుసూటిగా, బోల్డ్‌గా చెప్పేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్ సృష్టిస్తున్నాయి.

ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పూరీ మ్యూజింగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో టాప్ 2020 పాడ్ కాస్టర్‌గా ఇవి నిలిచాయి. ప్రముఖ స్పోటిపై ఇండియాలో పూరీ మ్యూజింగ్స్ టెలీకాస్ట్ కాగా.. 65 దేశాల్లో 540 నిమిషాలతో 152 ఎపిసోడ్స్ వైరల్ అయ్యాయి. 68,193 మంది వీటిని వినగా.. మూడు దేశాల్లో 104 రోజుల పాటు చార్ట్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచాయి. ఇతర పాడ్ కాస్ట్‌తో పోల్చినా ఇదే బెస్ట్ అని తెలుస్తోంది.

దీనిని బట్టి చూస్తుంటే పూరీ మ్యూజింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో అర్థమవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను పూరీ తెరకెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.