‘లైగర్’ నుంచి కీలక అప్డేట్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

liger release date announcement

ఇటీవలే విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది.

గురువారం ఉదయం 8.14 గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది.