నాట్యం టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్, నటి సంధ్యరాజు లీడ్ రోల్‌లో నటించిన నాట్యం సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ సోషల్ మీడియాలో ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె టీమ్‌కి ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. ఒక కథను వింటాం కదా.. అదే కథను కళ్లకు చూపిస్తే దానిని నాట్యం అంటాం.

natyam teaser by ntr

నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం అంటూ ఆదిత్య మేనన్ చెప్పే డైలాగ్‌లతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఈ టీజర్‌లోని సీన్లు, డైలాగ్‌లు చాలా ఆకట్టుకుంటాయి.