కమాండర్ అభినందన్ పాత్రలో విజయ్ దేవరకొండ.. సంజయ్ లీలా భన్సాలి న్యూ ప్లాన్!

గతేడాది ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ 2019 బాలకోట్ వైమానిక దాడిపై ఒక చిత్రాన్ని ప్రకటించారు. పాకిస్తాన్ లోని ఇ-మొహమ్మద్ యొక్క అతిపెద్ద టెర్రర్ స్థావరంపై భారత బలగాలు చాకచక్యంగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఆపరేషన్ సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్తమన్‌ను పాకిస్తాన్ బలగాలు ఖైదీగా తీసుకుని కొన్ని రోజుల తరువాత విడుదల చేశాయి.

అయితే అభిషేక్ కపూర్ తెలుగు నటుడు విజయ్ దేవరకొండతో అభినందన్ పాత్రను పోషించడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం పుల్వామా దాడి, అలాగే వైమానిక దాడి, ఆ తరువాత అభినందన్ ను ఖైదీగా పట్టుకోవడం మరియు అతను భారతదేశానికి తిరిగి వచ్చిన కోణాల్లో ఉంటుందని సమాచారం. ఇక చిత్రంలో నటించడానికి విజయ్ చాలా ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. కానీ ఇంకా అఫీషియల్ గా ఈ ప్రాజెక్టుకు సైన్ చేయలేదని తెలుస్తోంది. ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ ‘ఫైటర్’ తో రాబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.