28 ఏళ్లు పూర్తి చేసుకున్న విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 28 ఏళ్లు పూర్తి అయింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజయ్ ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. తమిళంలో హైయస్ట్ రెమ్యూనరేషన్ పొందే యాక్టర్ విజయ్‌నే. రజనీకాంత్ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించే నటుడు విజయ్. ఇప్పటివరకు 64 సినిమాల్లో నటించిన విజయ్.. అనేక అవార్డులు గెలుచుకున్నాడు.

VIJAY

పలుమార్లు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీల కేటగిరీలో టాప్ 100లో నిలిచాడు. పది సంవత్సరాల వయస్సుల్లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్.. తొలుత వెత్రి అనే సినిమాతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాల్లో బాల నటుడిగా నటించిన విజయ్.. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సినిమాల్లో నటించాడు. సౌత్ ఇండియాలోనే మెస్ట్ పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్.. 2008లో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిండర్‌గా వ్యహరించాడు. ఇక 2009లో తమిళనాడులో పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

తమిళంతో పాటు తెలుగులోనూ విజయ్‌కి అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ విజయ్ డబ్బింగ్ సినిమాలు విజయం సాధించాయి. అలాగే విజయ్ మక్కల్ ఇయ్యం అనే స్వచ్చంథ సంస్థను ప్రారంభించిన విజయ్… అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.