నాగార్జునకు షాకిచ్చిన బిగ్‌బాస్ రేటింగ్స్

తెలుగులో బిగ్‌బాస్-3తో పాటు బిగ్‌బాస్-4ను కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీజన్ 4 అత్యంత పేలవంగా సాగుతోంది. రేటింగ్స్ భారీ పడిపోవడంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మంచి ఫేమస్ కంటెస్టెంట్లు లేకపోవడం, ఎలిమినేషన్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదనే విమర్శలతే బిగ్‌బాస్ సీజన్ 4కు రేటింగ్స్ భారీగా పడిపోయాయి. దీంతో బిగ్‌బాస్ షోపై నాగార్జున కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలస్తోంది.

NAGARJUNA BIGBOSS

శని, ఆదివారాల్లో అయితే రేటింగ్స్ మరింత దారుణంగా పడిపోతున్నాయి. తాజాగా విడుదలైన బార్క్ రేటింగ్స్‌లో బిగ్‌బాస్ షో టాప్ 10లో లేకపోవడం గమనార్హం. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ టాప్1లోఉండగా.. ఇదే ఛానెల్‌లో నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు రేటింగ్స్ లేకపోవడం విశేషం. తాజాగా విడుదలైన రేటింగ్స్‌లో కార్తీకదీపం నెంబర్ వన్‌లో ఉండగా.. ఇస్మార్ట్ శంకర్ సినిమా రెండో స్థానంలో ఉంది.

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లకు 7 నుంచి 8 మధ్యలో టీఆర్పీ రేటింగ్స్ ఉండగా.. వీక్ డేస్‌లో మాత్రం 5 లోపు ఉంటుంది. ఇక డిసెంబర్ 7 నుంచి బిగ్‌బాస్ షో టైమ్‌ను మార్చాలని నిర్వాహకులు చూస్తున్నారు. ప్రస్తుతం శని, ఆదివారాల్లో ఈ షోకు 9 గంటలకు ప్రసారం అవుతుండగా.. మిగతా రోజుల్లో 9.30కి ప్రసారం చేస్తున్నారు. అయితే డిసెంబర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఇదే జరిగితే బిగ్ బాస్ రేటింగ్స్ మరింత తగ్గే అవకాశముంది. కానీ శని, ఆదివారాల్లో మాత్రం యాధాతధంగా రాత్రి 9 గంటలకు ప్రసారం చేయునున్నారు