తలపతి అభిమానులకు డబుల్ ధమాకా

ప్రస్తుతం విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు రెడీ అయింది. రానున్న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ విడుదల చేసే అవకాశముంది. ఈ మేరకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే మాస్టర్ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించగా.. న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశముంది.

vijay

ఇక డిసెంబర్ 31న మాస్టర్ సినిమా నుంచి కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది. ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు డిసెంబర్ 31న విజయ్ అభిమానులను మరో సర్‌ప్రైజ్ అందనుంది. విజయ్ తర్వాతి 65వ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశముంది. ఇటీవల డైరెక్టర్ అట్లీ ఇంటికి వెళ్లి విజయ్ కలిశాడు. దీంతో అట్లీతో విజయ్ తన తర్వాతి సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. క

కానీ తాజా సమాచారం ప్రకారం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్ విజయ్ తన 65వ సినిమా చేయనున్నాడనే వార్తలు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాయి. డిసెంబర్ 31న దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముందని చెబుతున్నారు. సన్ ఫిశ్చర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశముందని, అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలి.