హాట్ పిక్: విద్యా బాలన్ కి ఆ విషయం బాగా తెలుసు

బాలీవుడ్ టాలెంటెడ్ నటి విద్యా బిలాన్ ఏం చేసినా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ గ్లామర్ డోస్ పెంచాలి అనే విషయం ఆమెకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. ఆమె గత పదేళ్లలో చేసిన పాత్రలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. డర్టీ పిక్చర్ లాంటి కథలో సిల్క్ స్మిత పాత్రలో ఆమె గ్లామర్ డోస్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

మిషన్ మంగళ్ లాంటి ఛాలెంజింగ్ మూవీలో మహిళా సైంటిస్టుగా.. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకంగా.. ఆమె కనిపించిన తీరు ఆమోగం. ఇప్పుడు శకుంతలాదేవి (గణితశాస్త్ర మేధావి) గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఫోటో స్టిల్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. హాట్ నెస్ హైలెట్ అయ్యేలా ఫ్లోరల్ టాప్ తో ఆదరగొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడ ఎలా కనిపించాలో ఈ బ్యూటీకి బాగా తెలుసని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.