వాల్మీకీ ట్రైలర్ వచ్చేసింది…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్, ఈసారి మరో మెగాహీరో వరుణ్ తేజ్ ని వాల్మీకిగా చూపించడానికి రెడీ అయ్యాడు. తమిళ హిట్ సినిమా జిగర్తాండకి రీమేక్ గా రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్ అన్నీ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయగా, ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ వాల్మీకీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ప్రతి ఫ్రేమ్ లో హిట్ కళ కనిపించిన ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాడు. వరుణ్ లుక్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ సింప్లి సూపర్బ్. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేస్తున్న హరీశ్ శంకర్, తన పెన్ను పదునంతా ఈ సినిమాలోనే చూపించాడని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. పూజా హెగ్డే, వరుణ్ తేజ్ మధ్య వచ్చిన సీన్స్ 90’స్ లో తీసినవి కావడంతో జిగర్తాండ సినిమాకి హరీశ్ శంకర్ చాలా చేంజెస్ చేశాడని అర్ధమవుతుంది. లక్కిలీ వరుణ్ తేజ్ ఫ్రెష్ లుక్ కారణంగా హరీశ్ ప్రయోగం సక్సస్ అయ్యింది. యంగ్ ఏజ్ లో బడ్డింగ్ రౌడీగా కనిపించిన వరుణ్, ప్రెసెంట్ జెనరేషన్ లో మంచి ఫామ్ లో ఉన్న రౌడీగా రెండు షేడ్స్ ని చాలా బాగా చూపించాడు.

జిగర్తాండ సినిమాలోని సోల్ ని అలానే ఉంచి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా వాల్మీకీ సినిమాని మలిచారని తెలుస్తోంది. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన అథర్వ, మిర్నలిని తెరపై చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉన్నారు. ట్రైలర్ లో చూపించిన విజువల్స్, వాటికి ప్యాడింగ్ గా వచ్చిన మ్యూజిక్ రెండు చాలా బాగున్నాయి. హిట్ కళ కనిపిస్తున్న ఈ ట్రైలర్, వరుణ్ తేజ్ అండ్ హరీశ్ శంకర్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలబడుతుందనడంలో సందేహం లేదు.