టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో సినీ రచయిత మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. మరికొంతమందిని బలి తీసుకుంది. ఇప్పటికే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో మృతి చెందిన విషాదం నుంచి మరవకముందే.. తాజాగా ప్రముఖ టాలీవుడ్ స్టోరీ రైటర్ వంశీ రాజేష్‌ను కరోనా బలి తీసుకుంది.

గత కొద్దిరోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన.. తాజాగా కన్నుమూశారు. ఆయన మృతికి టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. వంశీ రాజేష్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

కాగా తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాను వంశీ రాజేష్ రచయితగా పనిచేశారు.