ఈ 10 మంది డైరెక్టర్లు మళ్లీ హిట్ అందుకోగలరా?

జీవితంలో గెలుపోటములు అనేవి సహాజం. అలాగే సినిమా ఇండస్ట్రీలో అపజయాలు అనేవి కూడా కామన్. బాగా హిట్ అవుతాయని భావించిన సినిమాలు ఫ్లాప్ కావొచ్చు. కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ కావొచ్చు. ఏ డైరెక్టర్ అయినా హిట్ అవ్వాలనే సినిమా తీస్తాడు. గత సినిమాలు ఫ్లాప్ కావడంతో నిరాశలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు మళ్లీ హిట్ కొట్టి పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలనే ఆశలో ఉన్నారు. వారెవరో ఇక్కడ చూద్దాం.

boyapati srinu

డైరెక్టర్ బోయపాటి శ్రీను గత సినిమా అయిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబుతో తీస్తున్న సినిమాతో సూపర్ హిట్‌ను అందుకుని కమ్ బ్యాక్ చేయాలని బోయపాటి ఆశిస్తున్నాడు. ఇక క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌తో చేయనున్న సినిమాతో మళ్లీ హిట్ అందుకోవాలని క్రిష్ భావిస్తున్నాడు.

ఢీ, దూకుడు, బాద్‌షా లాంటి సినిమాలతో విజయాలు అందుకున్న శ్రీను వైట్ల మళ్లీ హిట్ కొట్టాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇక మెహర్ రమేష్, వీవీ వినాయక్, శ్రీకాంత్ అడ్డాల, హను రాఘవపూడి, చంద్రశేఖర్ ఎలేటి, కృష్ణవంశీ, సంపత్ నందీ లాంటి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్లు ఇప్పుడు మళ్లీ ఫ్రేమ్‌లోకి రావాలని సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.