బిగ్‌బాస్-4కు నాగచైతన్య

బిగ్‌బాస్-4కు రేటింగ్స్ తగ్గుతుండటంతో బూస్టప్ ఇచ్చేందుకు నిర్వహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సెలబ్రెటీలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ సమంతతో హోస్టింగ్ చేయించగా.. దీపావళి రోజు ప్రసారమైన ఈ ఎపిసోడ్‌కు అఖిల్ అతిధిగా వచ్చాడు. ఇక గత వారం ఎపిసోడ్‌కు సుమ అతిధిగా వచ్చి అలరించింది.

NAGA CHitanya

ఇక ఈ వారం రానున్న స్పెషల్ దీపావళి ఎపిసోడ్‌కు నాగచైతన్య గెస్ట్‌గా రానున్నాడని సమాచారం. దీంతో ఈ వారం నాగార్జునతో కలిసి నాగచైతన్య ఎలా సందడి చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సారి కంటెస్టెంట్స్ ఎంపిక సరిగ్గా లేకపోవడంతోపాటు ఐపీఎల్ జరగడం వల్ల బిగ్‌బాస్-4కు రేటింగ్స్ బాగా తగ్గాయి. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ పేలవంగా సాగుతున్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి.