వెట్రిమారన్, సూర్యల… వాడివాసల్ మూవీ ఫస్ట్ లుక్

ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరైన వెట్రిమారన్, కోలీవుడ్ కమర్షియల్ హీరో సూర్య కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అసురాన్ తర్వాత వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి వాడివాసల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మోస్ట్ యాంటిసిపెటేడ్ మూవీస్ లో ఒకటిగా కోలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ ని ప్రొడ్యూసర్ కలైపులి థాను రిలీజ్ చేశారు. ట్విట్టర్ లో అఫీషియల్ గా బయటకి వచ్చిన ఈ ఫస్ట్ లో హీరో లేకుండా కథని ప్రెజెంట్ చేసేలా ఎద్దు బొమ్మని పెట్టడం విశేషం. చెల్లప్ప రాసిన వాడివాసల్ పుస్తకానికి ఇది సినిమా రూపం. జల్లికట్టు, తమిళ కల్చర్ ని ప్రెజెంట్ చేస్తూ వస్తున్న ఈ రూరల్ డ్రామాపై అందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. హీరో సూర్య కూడా వాడివాసల్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. నవల్స్ ని సినిమాలుగా తీర్చిదిద్దడంలో దిట్ట అయిన వెట్రిమారన్, వాడివాసల్ కూడా వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలబెట్టాలని చూస్తున్నాడట. వెట్రిమారన్ గతంలో తెరకెక్కించిన నేషనల్ అవార్డు మూవీ అసురన్ కూడా నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే.