యంగ్ టైగర్ అభిమానుల కోరికలని కొరటాల ఫుల్ ఫిల్ చేస్తాడా?

ఇచ్చట అన్ని వాహనాలు రిపేర్ చేయబడును… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ట్యాగ్ లైన్ ఇది. మొక్కలతో పాటు మనుషులని కూడా కాపాడుకోవాలని చెప్పిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే జోష్ లో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఇంకో మూవీ చేయబోతున్నారు. ఈ విషయమై ఇటీవలే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి విషెస్ చెప్తూ పోస్టర్ బయటకి వచ్చింది. కూల్ అండ్ చార్మింగ్ గా ఉన్న ఎన్టీఆర్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది.

ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ కి వచ్చేయడంతో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా గురించి నెట్ లో చర్చ మొదలయ్యింది. ఈ హిట్ కాంబినేషన్ పై నందమూరి అభిమానులకి కొన్ని కోరికలు ఉన్నాయి. అభిమానుల కోరికలని కన్సిడర్ చేసుకోని సినిమా చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, అసలు యంగ్ టైగర్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో చూద్దాం. త్వరలో మొదలవ్వనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పక్కన కీయరా అద్వాని హీరోయిన్ అయితే బాగుంటుందని వాళ్లు ఫీల్ అవుతున్నారు. కీయరాని తెలుగులో లాంచ్ చేసింది కొరటాలనే కాబట్టి క్యారెక్టర్ కి ఆమె సెట్ అయితే కీయరా ntr30లో నటించడం పెద్ద విషయమేమీ కాదు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అడుగుతున్న మరో కోరిక, ఈ ప్రాజెక్ట్ ని అనిరుద్ మ్యూజిక్ ఇవ్వడం. నిజానికి అరవింద సమేత సినిమాకే అనిరుద్, ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అవ్వాల్సి ఉంది కానీ అజ్ఞాతవాసి రిజల్ట్ ఎఫెక్ట్ పడి… అరవింద సమేత అనిరుద్ నుంచి తమన్ చేతికి వెళ్ళింది. ఇప్పుడు ntr 30కి అయినా అనిరుద్, ఎన్టీఆర్ కాంబో సెట్ అయితే బాగుంటుందని వాళ్లు భావిస్తున్నారు. అనిరుద్ ఇచ్చే ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ కి తారక్ డాన్స్ కూడా కలిస్తే థియేటర్స్ మారుమొగాల్సిందే. మరి దర్శకుడు కొరటాల శివ ఈ రిక్వెస్ట్లని కన్సిడర్ చేసి ntr30 కోసం అనిరుద్ ని, కీయరాని ఆన్ బోర్డ్ తెస్తాడెమో చూడాలి.