మరో యువ హీరోను టార్గెట్ చేసిన త్రివిక్రమ్

అల..వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని మరోసారి అగ్ర దర్శకుడు అనిపించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్టీఆర్ ను లాక్ చేసినప్పటికీ, త్రివిక్రమ్ కు మరో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తగినంత సమయం ఉంది. ఎందుకంటే ఎన్టిఆర్ ఆర్ఆర్ఆర్ షూట్లో బిజీగా ఉన్నాడు. ఇప్పట్లో దొరికేలా లేడు.

ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ మహేష్ బాబును కలుసుకున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్ వివరించి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నాడట. అయితే ఆశ్చర్యకరంగా త్రివిక్రమ్ ఇటీవల రామ్‌ను కూడా కలుసుకుని అతనికి స్క్రిప్ట్ వివరించాడట. రామ్ కూడా వెంటనే
ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ ఎవరికి దర్శకత్వం వహిస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. హారికా – హాసిని క్రియేషన్స్ రామ్ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మించవచ్చని టాక్. త్రివిక్రమ్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.