పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్‌ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దసరా సందర్భంగా అఫీషియల్. ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ కథలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక వచ్చే ఏడాది సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. సాగర్ చంద్ర దర్శకుడు. మరో కీలకమైన పాత్ర కోసం రానా దగ్గుబాటితో చర్చలు జరుపుతున్నారు. రానా కూడా ఈ ప్రాజెక్ట్ చేయడానికి అసక్తిగానే ఉన్నట్లు సమాచారం.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ చిత్రానికి ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ ని సెట్ చేయాలని పరిశీలిస్తున్నారట. ఇప్పటి వరకు నిర్మాతల నుండి అయితే అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రం మొత్తం షూట్ పొల్లాచిలో జరుగుతుందట. వీలైనంత వరకు ఒకే ఒక్క షెడ్యూల్‌లో పూర్తవుతుందని సమాచారం. దర్శకుడు ఇతర నటులు మరియు సాంకేతిక నిపుణులును సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. బిల్లా రంగాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇక ఈ చిత్రంను మే 2021లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చే నెల 1 నుండి వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తాడు. ఇక అయ్యప్పనమ్ కోషియం యొక్క రీమేక్‌ స్టార్ట్ చేయడానికి ముందు క్రిష్ చిత్రం యొక్క మరో షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నట్లు సమాచారం.