కరోనా కారణంగా యంగ్ సింగర్ మృతి

“జై” సినిమాలో ” దేశం మనదే , తేజం మనదే , ఎగురుతున్న జండా మనదే… పాటతో ప్రాచుర్యం పొందిన నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ జై శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా కరోనా తో పోరాడుతూ సికింద్రాబాద్ లోని ఓ ప్రయివేటు తుది శ్వాస విడిచారు. 42 ఏళ్ల వయసున్న శ్రీనివాస్, కరోనా సోకడంతో ఏప్రిల్ 24న హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. కరోనా సివియర్ గా ఉండడంతో శ్రీనివాస్ వెంటిలేటర్ పై ఉండాల్సి వచ్చింది. తోటి సింగర్స్ అందరూ శ్రీనివాస్ కి ఆర్ధిక సాయం చేయమని కూడా మే 3న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంత మంది ప్రేమని సొంతం చేసుకున్న శ్రీనివాస్ దాదాపు నెల రోజుల పాటు కరోనాతో పోరాడి ఈరోజు మరణించాడు.