బీఏ రాజు ఇక లేరు…

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో పీఆర్వోలు ఉన్నారు కానీ బీఏ రాజు గారు అందరిలోకి ప్రత్యేకం. సీనియర్ మోస్ట్ పీఆర్వో అయిన రాజు ఎన్నో సినిమాలకి ప్రొమోషన్స్ చేసి పెట్టారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే రాజు కొద్ది సేపటి క్రితం మరణించారు. షుగర్ లెవల్స్ ఫ్లక్ట్యూయేట్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని రాజు గారి కొడుకు శివకుమార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

సూపర్ హిట్ ఫిల్మ్ మ్యాగజైన్ ని 23 ఏళ్ల పాటు నడిపిన రాజుగారు సినీ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు వెయ్యి సినిమాలకి పీఆర్వోగా చేసిన రాజు గారి హఠాన్మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇటీవలే ఇండస్ట్రీ హిట్ వెబ్సైట్ ప్రారంభించి సినీ వార్తలన్నీ ఒకే దెగ్గర దొరికేలా చేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్ గా పీఆర్వోగా నిర్మాతగా సినిమాకి ఆయన చేసిన సేవలు చాలా గొప్పవి. ఘట్టమనేని అభిమానులకి బాగా దెగ్గర మనిషి అయిన రాజు గారు ఇక లేరు అనే వార్త వినడం అందరికీ ఆశ్చర్యం కలిగించడమే కాకా బాధ కలిగించేది కూడా. సినిమాకి ఏ సంబంధించి ఏ వార్త కావాలన్నా, ఏ హీరో గురించి అప్డేట్ తెలియాలి అన్నా BARaju Super Hit అని మీ ట్విట్టర్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఇకపై మేము ఆ ట్విట్టర్ ఖాతాని ఓపెన్ చేసి ఏం చూడాలి రాజు గారు, ఏడాదికి ఎన్నో సినిమాలు పట్టాలెక్కుతున్నాయి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి… అవన్నీ మాకు తెలియజేయాల్సిన మీరు మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి వెళ్లడం భావ్యమేనా? మీరు ఇంకొన్ని రోజులు ఉండాల్సింది రాజు గారు, ఇంకొన్ని సినిమాలకి పని చేయాల్సింది. మరణించే వరకూ సినిమాతోనే బ్రతికిన మీరు, సినిమా అనే పదం ఉన్నంత వరకూ గుర్తుంటారు. రెస్ట్ ఇన్ పీస్ రాజు గారు. ఇన్నేళ్లు అలుపెరగని ప్రయాణం చేశారు, ఇక సెలవు తీసుకోండి. మళ్లీ జన్మంటూ ఉంటే బి.ఏ. రాజు సూపర్ హిట్ గానే పుట్టండి. ఎందుకంటే మీరు నిజంగానే ఒక సూపర్ హిట్ వ్యక్తి. ఇంతటి మంచి మనిషి, బాధ్యత తెలిసిన వ్యక్తి, విజన్ ఉన్న రాజుగారి ఆత్మకి శాంతి చేకూరాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం. రాజు గారు భార్య దర్శక దిగ్గజాల్లో ఒకరైన బి.జయ గారు 2018లో మరణించారు.