Tollywood: నేడు శ‌ర్వానంద్ బ‌ర్త్ డే.. మ‌హా స‌ముద్రం ఫ‌స్ట్ లుక్!

Tollywood: నేడు శ‌ర్వానంద్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన తాజా చిత్రం మ‌హాస‌ముద్రం నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆర్ఎక్స్‌100 బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో మ‌రో హీరో సిద్ధార్థ్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. కాగా ఈ రోజు శ‌ర్వా బ‌ర్త్‌డే కానుక‌గా..ఈ Tollywood చిత్రం నుంచి శ‌ర్వా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ మేర‌కు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

sharanand

ఈ పోస్ట‌ర్‌లో శ‌ర్వా చేతిలో రాడ్ పట్టుకుని.. సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇక ఈTollywood చిత్రంలో ఆదితి రావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ వైజాగ్ పరిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ఇక ఈ చిత్రానికి చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండ‌గా. ఆగ‌ష్టు 19న ఈ Tollywood చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంచితే.. నేడు శ‌ర్వానంద్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా.. టీఎఫ్‌పీసీ త‌ర‌పున శ‌ర్వా హ్యాపీ బ‌ర్త్‌డే.