Bollywood: తాప్సీ, అనురాగ్‌పై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నా..

Bollywood: బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ అంటే ఎవ‌రు అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది కంగ‌నా ర‌నౌత్‌. ఆమె త‌న సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో వివాదాల రాణిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇటీవ‌లే బాలీవుడ్ ప్ర‌ముఖుల ఇంట్లో ఐటీ సోదాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బాలీవుడ్ ప్ర‌ముఖులు అయినా Bollywood తాప్సీ, అనురాగ్ ల ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జ‌రిపారు.. కాగా ఈ విష‌యంపై కంగ‌నా వీరిద్దరిపై సోష‌ల్ మీడియాలో నిప్పులు చెరిగింది. ఈ మేర‌కు ఆమె వ‌రుస‌గా ట్వీట్లు చేశారు..

kangana comments

కేవ‌లం టాక్స్ ఎగ‌వేతే కాదు.. న‌ల్ల‌ధ‌నంతో భారీ లావాదేవీలు జ‌రిగాయి. షాహీన్బాగ్ అల్ల‌ర్లు లేదా రిప‌బ్లిక్ డే రోజున హింస‌ను రెచ్చ‌గొట్ట‌డానికి వారికి ఆ డ‌బ్బు వ‌చ్చిందా? న‌ల్ల‌ద‌నం ఎక్క‌డినుంచి వ‌చ్చింది? వారు ఈ న‌ల్ల‌ధ‌నాన్ని ఎక్క‌డికి పంపారు. లెక్క‌లోకి రాకుండా అంటూ నేరుగా Bollywood కంగ‌నా వారిపై అటాక్ చేసింది. ప్ర‌తి నిమిషం నంబ‌ర్ల్ పెరుగుతున్నాయి.. ఇది అధికారులు ఆధారాలు క‌నుగొన్న డ‌బ్బు మాత్ర‌మే.. మ‌నీ లాండ‌రింగ్ అస‌లు సంఖ్య ఎంత అన్న‌ది మాత్ర‌మే ఊహించ‌వ‌చ్చు. బుల్లి దావుద్‌.. ఉగ్ర‌వాద రాకెట్ వీళ్లంతా.. టాక్స్ చోర్‌లు మాత్ర‌మే కాదు అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది కంగ‌నా.. అలాగే క్వాన్ ఏజెన్సీ.. ఫాంట‌మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పేర్ల‌ను కంగ‌నా ప్ర‌స్తావించింది.. ఒక‌సారి దొంగ ఎప్పుడూ దొంగే దేశాన్ని ముక్క‌లుగా చేసి విక్ర‌యించాల‌నుకునే వారంతా దేశ‌ద్రోహులు.. దేశ ద్రోహుల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న వ్య‌క్తులు కూడా దొంగ‌లే అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరిగింది Bollywoodకంగ‌నా.