Superstar: నేడు త‌లైవా మ్యారేజ్ డే.. ర‌జ‌నీ కూతురు ఎమోష‌న‌ల్ ట్వీట్‌!

Superstar: కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినీ ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్‌ఫుల్ న‌టుడు.. సూప‌ర్‌స్టార్ త‌లైవా అంటూ ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. నేడు త‌లైవా ర‌జ‌నీకాంత్ గారి నేడు మ్యారేజ్‌డే. వైవాహిక జీవితంలోకి ప్ర‌వేశించి 40సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా Superstarర‌జ‌నీకాంత్ పెద్ద కూతురు ఐశ్వ‌ర్య సోష‌ల్ మీడియాలో ర‌జకాంత్ పెళ్లి నాటి ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి లోన‌య్యారు.

Rajanikanth marriage day

Superstarర‌జ‌నీకాంత్‌- ల‌త దంప‌తులు 1981 ఫిబ్ర‌వ‌రి 26న ఒక్క‌ట‌య్యారు. మ్యారేజ్ అంటే ఒక‌రి బాధ్య‌త‌ని మ‌రొక‌రు మోయ‌డం అనే విష‌యాన్ని అమ్మానాన్న‌ని చూసే తెలుసుకున్నాను. ఒక బంధం బ‌ల‌ప‌డ‌డానికి భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఉండే అనుబంధం కార‌ణ‌మ‌వుతుంద‌నే విష‌యం అర్థ‌మైంది. వ్య‌క్తులుగా ఎదిగే ప్ర‌తిద‌శ‌లోనూ జీవితానికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని నేర్చుకుంటూ జీవితానికి అర్థం తెలుసుకుంటాం. అప్పా అమ్మా మీ ఇద్ద‌రికీ సూప‌ర్ డూప‌ర్ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపింది ఐశ్వ‌ర్య‌. ఇక ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తె సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌తేడాది ఈ చిత్ర షూటింగ్‌లో ర‌జ‌నీ అనారోగ్యాబారిన ప‌డి.. అప్ప‌టి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ Superstarర‌జ‌నీ పాల్గొన‌బోతున్నాడ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.