12 ఏళ్ల తర్వాత ఆ పేరు మళ్లీ వినిపించింది, ఫ్యామిలీ మ్యాన్ 2 టీం షాక్

వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎథికల్ ఆర్మీ అనగానే శ్రీలంకన్ తమిళుల స్వాతంత్రం కోసం పోరాడిన LTTE గుర్తొస్తుంది. లిబరేషన్ ఆఫ్ తమిళ టైగెర్స్ ఈలంగా ప్రపంచానికి తెలిసిన ఈ సంస్థకి నాయకుడు వేలుపుల్లై ప్రభాకరన్. ది టైగర్ దట్ ఫాట్ ఫర్ హిస్ పీపుల్ టిల్ హిస్ లాస్ట్ బ్రీత్. మరణించే క్షణం వరకూ పోరాడిన ప్రభాకరన్ మే 19 2009న భీకర యుద్ధంలో మరణించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అలుపెరగక జరిగిన పోరు ఆగిన రోజది. వీరులకి మరణం ఉండదు, మరో జన్మా ఉండదు, నమ్మిన ప్రజల జ్ఞాపకాల్లో ఉంటారు అంతే. ఈ 12 ఏళ్లలో ప్రభాకరన్ గురించి బయటకి మాట్లాడిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఇక ప్రపంచం ఆయన్ని మరిచిపోతుందేమో అనుకుంటున్న సమయంలో గడిచిన 72 గంటలుగా సోషల్ మీడియాలో ప్రభాకరన్ పేరు రీ సౌండ్ లా వినిపిస్తుంది. దానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ 2 టీం అవ్వడం విశేషం.

మే 19న ప్రభాకరన్ డెత్ ఆనివర్సరీ అయితే అనుచరులు ఆయన గురించి ట్వీట్స్ చేశారు. ఇది జరిగిన నెక్స్ట్ డే అంటే అమెజాన్ ప్రైమ్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ బయటకి వచ్చింది. ట్రైలర్ బాగుంది, మేకింగ్ అదిరిపోయింది, భారీ వ్యూస్ రావడం ఖాయమని అమెజాన్ ప్రైమ్ సంతోషంగా ఉన్న టైములో సోషల్ మీడియాలో ఒక సంచలనం పుట్టింది. దాని పేరు #Familyman2_against_tamils తమిళనాడు కేంద్రంగా ట్విట్టర్ లో మొదలైన ఈ ట్రెండ్ కాసేపటికే ఇంటర్నెట్ కి షేక్ చేసింది. తమిళులపై ఇప్పటికే చేసిన అరాచకాలు చాలు, LTTEని తీవ్రవాద ముద్ర వేశారు… మాది స్వాతంత్ర పోరాటం. మమ్మల్ని ఎక్కడ తక్కువ చేసి చూపించినా, చెడుగా చూపించినా ఫ్యామిలీ మ్యాన్ 2ని బ్యాన్ చేస్తాం అంటూ అమెజాన్ ప్రైమ్ కి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.

చేసేదేమి లేక అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రైలర్ లో నుంచి ISI అండ్ తమిళ్ రెబల్స్ అనే పదం తొలిగించి ట్రైలర్ మళ్లీ అప్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. సీరీస్ లో కూడా తమిళ టైగర్ ని, వారి పోరాటాన్ని తక్కువ చేసేలా ఏమైనా సన్నివేశాలు ఉంటే విడుదలకి ముందే కట్ చేయడానికి ప్రైమ్ వీడియో సిద్దమయ్యింది. ISI టెర్రరిస్ట్ లతో కలిసి LTTE వినగానే ప్రజలు స్పందించిన తీరు, తమది ఎథికల్ గ్రూప్ అని నిరూపించిన విధానం చాలా కాలం పాటు గుర్తుండి పోతుంది. ఈ ఇన్సిడెంట్ ప్రజల మనసులో ప్రభాకర్ ఇంకా ఉన్నాడు అనే విషయం గుర్తు చేసింది, ఎవరైనా ఆయన కథని పూర్తి స్థాయిలో రెడీ చేసి ఒక సినిమా చేస్తే LTTE ఎందుకు పుట్టింది? ఎవరి కోసం పుట్టింది? ఎవరితో పోరాడింది అనే విషయాలు అందరికీ తెలుస్తాయి.