కంటెంట్ ఉన్నోడికి కటవుట్ చాలు…

ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే అభిమానులు థియేటర్స్ కి పరుగులు పెడతారు. కటవుట్లు పెడతారు, పూలమాలలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా థియేటర్స్ దెగ్గర జరిగే తంతు ఇదే. మొదటిసారి హీరోకి కాకుండా విలన్ కి పాలాభిషేకాలు, పూలమాలలు వేసి సంబరాలు చేస్తున్నారు, అయితే అది థియేటర్స్ దెగ్గర కాకపోవడం విశేషం. కరోనా సమయంలో కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్న ఆఫ్ స్క్రీన్ హీరో సోను సూద్. బస్సుల దెగ్గర నుంచి ఆక్సిజన్ వరకూ అన్నీ సప్లై చేసిన సోనూ సూద్ కి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో పాలాభిషేకం చేశారు. ది రియల్ హీరో అంటూ సోను పూల మాల వేశారు. ఇది నెట్ లో వైరల్ అవ్వడంతో స్పందించిన సోను ఎమోషనల్ అయ్యాడు. హి డిసర్వ్ దిస్ He Deserve our love, he deserve our respect.