మే 31న ఘట్టమనేని వారి పాట

ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిపొయింది.. నందమూరి అభిమానులు సోషల్ మీడియాని 24 గంటలు పాటు దున్నేశారు. ఇక ఇప్పుడు ఘట్టమనేని అభిమానుల వంతు అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్ తగ్గగానే మహేశ్ ఫ్యాన్స్ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నారు. ట్వీట్స్ వేయడంలో సెపరేట్ రికార్డ్స్ ఉన్న మహేష్ ఫ్యాన్స్, సర్కారు వారి పాట కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ దుబాయ్ లో డు నెలల పాటు జరిగింది. సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సిన టైములో కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.

ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం ఘట్టమనేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారి ఎదురు చూపుకి తెరదించుతూ మే 31న ఘట్టమనేని అభిమానులకి మహేష్ డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. అందులో ఒకటి సర్కారు వారి పాట గ్లిమ్స్ కాగా మరొకటి త్రివిక్రమ్ మూవీ అప్డేట్. ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ రాబోతున్నాయి. సో ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా ఆఫర్.