అనసూయకి ఆర్ ఎక్స్ పాపా చెక్?

జబర్దస్త్ యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత క్షణం మూవీతో తనలోని యాక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తూ కెరీర్ ని సెట్ చేసుకుంటున్న అనసూయకి హాట్ హీరోయిన్ పాయల్ రాజపుత్ చెక్ పెట్టేలా ఉంది. ఒకరేమో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్, ఇంకొకరు ఏమో సపోర్టింగ్ యాక్ట్రెస్… అలాంటిది ఈ ఇద్దరికీ పోటీ ఏంటి, ఒకరికి ఇంకొకరు చెక్ పెట్టడం ఏంటి అనుకుంటున్నారా? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒక ప్రాజెక్ట్. పాత నాగార్జునని గుర్తు చేసిన ఈ మూవీలో ఏ ఫ్రేమ్ చూసినా రంగు రంగులుగా కనిపిస్తుంది. స్పెషల్ గా డిసైన్ చేసిన టైటిల్ సాంగ్ లో పంచకట్టిన నాగ్ చుట్టూ, పల్లెటూరు అందాలు చూపిస్తూ అనసూయ కనిపించింది.

త్వరలో “సోగ్గాడే చిన్నినాయన” సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తున్న నేపథ్యంలో, మొదటి భాగంలో లాగే ఇందులో కూడా ఒక స్పెషల్ సాంగ్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇందు కోసం హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని అప్ప్రోచ్ అయ్యారట. ఆమె కూడా ఓకే చెప్పడంతో పాయల్ నాగార్జున కలిసి కనిపించడం ఖాయం. అయితే పాయల్ సాంగ్ కి మాత్రమే పరిమితం కాకుండా అనసూయలాగా కొన్ని సీన్స్ లో కూడా కనిపించబోతుందని సమాచారం. ఇదే జరిగితే ఫస్ట్ పార్ట్ లో ఉన్న అనసూయ సీక్వెల్ లో లేనట్లే.