Thalaivi: కంగ‌నా న‌టించిన “త‌లైవి” నుంచి రొమాంటిక్ పోస్ట‌ర్ రిలీజ్‌‌..

Thalaivi: బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ తాజా చిత్రమైనా త‌లైవి నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. దివంగ‌త న‌టి, త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర‌ను పోషిస్తుంది. అలాగే Thalaivi ఎంజీఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద‌స్వామి న‌టిస్తుండ‌గా.. ఆయ‌న భార్య‌గా ప్ర‌ముఖ న‌టి మ‌ధుబాల న‌టిస్తుంది. కాగా ఈ రోజు మ‌ధుబాల పుట్టిన రోజు సంద‌ర్భంగా అర‌వింద‌స్వామి, మ‌ధుబాల సీన్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Kangana

ఈ మేర‌కు ఈ పోస్ట‌ర్‌ను కంగ‌నా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు మ‌ధు అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్ట‌ర్‌లో అర‌వింద‌స్వామి ఆసుపత్రిలో ఉన్న‌ప్పుడు మ‌ధుబాల అత‌ని ప‌క్క‌న కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక ఈThalaivi చిత్రాన్ని క‌ర్మ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విబ్రీ మీడియా సంస్థ నిర్మిస్తున్నారు. హిందీ, త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.