Mega Powerstar: ఆచార్య వెంట అడుగువేస్తున్న‌ సిద్ధ పోస్ట‌ర్ రిలీజ్‌..

Mega Powerstar: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా నిన్న ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి సీతారామ‌రాజు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ పోస్ట‌ర్ ప్రేక్షకాభిమానుల‌ను ఎంతో అల‌రించింది. సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక తాజాగా నేడు చెర్రీ బ‌ర్త్‌డే కానుక‌గా ఆచార్య చిత్రం నుంచి తాను పో‌షించిన సిద్ధ పాత్ర తొలి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది మేక‌ర్స్‌. ఇందులో చ‌ర‌ణ్ కామ్రేడ్‌గా నటిస్తున్నాడు.

Sidha look

మెగాస్టార్ చిరంజీవి-చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ గెట‌ప్‌లో చేతిలో తుపాకులు ప‌ట్టుకుని న‌డుస్తున్న ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ మేర‌కు ఆ పోస్ట‌ర్‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ ఆచార్య చిత్ర‌బృందం తెలిపింది. ఇక ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్దే, సోనూసూద్ వంటి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తుండ‌గా.. మే 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.