రామ్ చరణ్ పుట్టిన రోజున కలిసి శుభాకాంక్షలు తెలిపిన TFJA సభ్యులు

ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా TFJA సభ్యులు రామ్ చరణ్ గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారికి బొకేలు అందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతు సురేంద్ర కుమార్ నాయుడు గారు, లక్ష్మీనారాయణ గారు, మూర్తి గారు, రాంబాబు గారు, వంశీ గారు, ఫణి గారు, రఘు గారు, తదితరులు రామ్ చరణ్ గారిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే రామ్ చరణ్ TFJA సభ్యులతో కలిసి కూర్చుని కాసేపు ముచ్చటించడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో కలిసి తిరుపతి దర్శనం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన తర్వాత సినిమా అయినా గేమ్ చేంజెర్ లోని ఓ పాట అప్డేట్గా గేమ్ చేంజెర్ టీం నుండి డిలీట్ చేయడం జరిగింది.