సీరియల్స్ తో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే తారలు వీళ్లే!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కంటే కూడా సీరియల్స్ లో నటించే వాళ్ళ ఆదయమే ఎక్కువగా ఉంటోంది. గతంలో మాదిరిగా కాకుండా బుల్లితెర నటీమణులకు తక్కువ రెమ్యునరేషన్ ఏమి అందడం లేదు. ఒక సీరియల్ కంటిన్యూగా కొనసాగితే వాళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్ ల రేంజ్ లో ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే వారికి డైలీ పేమెంట్స్ అందుతాయి.

ఇక ఒకసారి టాప్ స్టార్స్ డైలీ పేమెంట్స్ పై ఒక లుక్కేస్తే.. అత్యధికంగా టాప్ రేటింగ్ అందుకుంటున్న కార్తీక దీపం కాబట్టి అందులో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ రెమ్యూనరేషన్ కొంచెం కొంచెంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆమెకు రోజుకు 25వేల రూపాయలు అందుతున్నాయి. ఇక అపరంజి ఫేమ్ సుహాసినికి, నా పేరు మీనాక్షి ఫ్యామ్ నవ్య స్వామి, అగ్నిసాక్షి ఐశ్వర్య వంటి వారికి రోజుకు 20వేలకు అందుకుంటున్నారు.

ఇక ఆడదే ఆధారం పల్లవి, కథలో రాజకుమారి అషికా , సమీరా షరీఫ్ వంటి నటీమణులు 10 నుంచి 15వేల వరకు డైలీ పేమెంట్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే ఏళ్ల తరబడి సీరియల్స్ ద్వారా బిజీగా ఉండే నటీమణులు వారి ఆదాయాన్ని ఏ రేంజ్ లో పెంచుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.