మేడమ్ సర్… మేడమ్ అంతే… అది నడుమా నయాగరా సోయగమా?

మల్లేశం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్ అనన్య నాగళ్ల. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ట్రెడిషనల్ గా కనిపించి మెప్పించింది. ఎప్పుడూ అచ్చం తెలుగు అమ్మాయిగా ఉండే అనన్య వకీల్ సాబ్ సినిమాలో నటించింది. ఈ మూవీలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలో మెరిసిన అనన్య, సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది. మొన్నటికి మొన్న నడుము కిందకి చీరకట్టి ఫొటోస్ పోస్ట్ చేసిన అనన్య నాగళ్ల, చీర వెనక ఇంత అందం ఉందా? అనిపించేలా చేసింది.

ఆ మత్తులో నుంచి యూత్ ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు రెడ్ టిషర్ట్ లో మరోసారి నడుము సోయగాలని చూపిస్తూ కిక్కిస్తుంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కేవలం నటనను మాత్రమే నమ్ముకున్న అనన్య ఇకపై నటనతో పాటు తన గ్లామర్ ని కూడా నమ్ముకునేలా ఉంది. ఇండస్ట్రీలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదని అర్థం చేసుకున్నట్లుంది. మెల్లగా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేస్తూ సోషల్ మీడియాని వేడెక్కిస్తుంది. మరి ఆ ఆన్లైన్ గ్లామర్ షో అనన్యకి ఎలాంటి సినిమాలు తెస్తాయో చూడాలి.