మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు…

2019 సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీలో అన్నతమ్ములుగా నటించిన వెంకటేష్, వరుణ్‌తేజ్ ఫన్ రైడ్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ని చిత్ర యూనిట్ మళ్లీ పనులు మొదలుపెట్టింది. ఈ విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. “నేను అభిమానించే నా కో-బ్రదర్స్‌తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..”అని అనిల్ రావిపూడి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హీరో వరుణ్ తేజ్ కూడా “లవ్‌లీ టీమ్‌తో మళ్ళీ వర్క్ మొదలైంది..’ అని తెలుపుతూ.. లొకేషన్‌లోని పిక్‌ని షేర్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. “2019లో సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 సినిమాకు ఫ్రాంచైజీగా ఎఫ్ 3 సినిమాను అదే టీమ్‌తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాము. హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభమైంది”అని అన్నారు. ముందు పార్ట్ కన్నా ఎక్కువ ఫన్ తో రానున్న ఈ మూవీలో సునీల్ కూడా నటిస్తుండడం విశేషం.