లైన్ క్లియర్… రామ్ చరణ్ చేతిలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్

ఆర్ ఆర్ ఆర్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మరో నెల రోజుల్లో రాజమౌళి నుంచి పక్కకి రానున్నాడు. ఇక్కడితో ట్రిపుల్ ఆర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుండడంతో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాని కొంచెం గ్యాప్ తీసుకోని మొదలు పెట్టడానికి సిద్దం అవనున్నాడు. అయితే చరణ్ తన నెక్స్ట్ మూవీని డీల్ రాజు బ్యానర్ లో… సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ తో అనౌన్స్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మరో పాన్ ఇండియా మూవీ అంటూ మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ఇండియన్ 2 సినిమా నిర్మాణ సంస్థ లైకా… ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకూ డైరెక్టర్ శంకర్ మరో సినిమా చేయకూడదు అంటూ పై మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. దీంతో చరణ్ శంకర్ సినిమా ఆగిపోతుందేమో అనుకున్నారు.

తాజాగా లైక నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ కొట్టేస్తూ మద్రాస్ హై తీర్పు ఇచ్చింది. ఇండియన్ టు సినిమా కంప్లీట్ అవ్వకపోయినా పరవాలేదు వేరే సినిమాలు శంకర్ దర్శకత్వం వహించుకోవచ్చని… గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. దీంతో శంకర్ చరణ్ సినిమాకి లైన్ క్లియర్ అయ్యింది. అన్నీ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగితే ఈ క్రేజీ మూవీ ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. శంకర్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే లోపు చరణ్ ఆర్ ఆర్ ఆర్ అండ్ ఆచార్య వర్క్స్ కంప్లీట్ చేసుకోని ఫ్రీ అవ్వనున్నాడు.