“తార‌క్” అనే పేరు మార్చుకున్న తార‌కర‌త్న‌!

తార‌క‌ర‌త్న తెరంగ్రేటం చేసి ఇన్ని సంవ‌త్సరాలైన ఇప్ప‌టివ‌ర‌కు చెప్పుకోద‌గ్గ స‌రైన హిట్ లేదు. నంద‌మూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఓ రేంజ్‌లో దూసుకొచ్చాడు కానీ.. చేసిన ప్ర‌తి సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఆయ‌న కెరీర్ స‌మాప్తం అయిన‌ట్లేన‌ని అంటూ గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న హీరోగా దేవినేని అనే సినిమాను చేస్తున్నాడు. కాగా ఈ సినిమాను న‌ర్రా శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, దేవినేని, వంగ‌వీటి కుటుంబాల మ‌ధ్య ఉన్న సంబంధాల నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో

tarakarathna

వంగ‌వీటి రంగ పాత్ర‌ను సంతోషం సురేష్ కొండేటి పోషించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మోస్ట‌ర్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈసినిమా నుండి తార‌క‌ర‌త్న త‌న పేరును తార‌క్ అంటూ మార్చుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు తార‌క‌ర‌త్న‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని.. త్వ‌ర‌లోనే దేవినేని మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామంటూ నిర్మాత‌లు వెల్ల‌డించారు. ‌