నవ్వుతోనే పాతి పెట్టాలి.. కంగానుకు మరో కౌంటర్ ఇచ్చిన తాప్సి

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సి vs కంగనా రనౌత్ మధ్య ఎలాంటి వార్ కొనసాగుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా తాప్సి ఒక బీ గ్రేడ్ యాక్టర్ అంటూ ఇటీవల కంగనా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకు చాలా సార్లు తాప్సి కూడా కంగనాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన మరొక పోస్ట్ వైరల్ గా మారింది.

‘గెలుపుతోనే వారిని చంపండి. కేవలం నవ్వుతోనే పాతి పెట్టండి- బోల్ట్’ అంటూ తాప్సి చిరునవ్వు ఉన్న క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ కౌంటర్ ఎవరికో అర్థమై పోయిందని ఓ వర్గం నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా బాలీవుడ్ కి చెందిన కొంతమంది సెలబ్రెటీస్ కూడా ఆ పోస్ట్ పై పాజిటివ్ గా స్పంధించారు. భూమి పెడ్నేకర్‌ ‘క్యూట్‌ అంటూ కామెంట్ చేయగా.. దియా మీర్జా ‘హార్ట్‌ సింబల్‌’ను షేర్‌ చేసుకుంది. దీంతో వీరు కంగనా రేపిన వివాదంలో తాప్సికి మద్దతుగా నిలుస్తున్నారని అర్ధమవుతోంది.