ప్రముఖ కమెడియన్ మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

ప్రముఖ తమిళ హాస్యనటుడు తవసి మరణించారు. గత కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా చివరి స్టేజ్ క్యాన్సర్‌తో తవసి బాధపడుతున్నారు. ఆయన మృతితో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణంతో కోలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు.

tavasi

తవసి మృతి పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అద్భుతమైన కమెడియ్‌ను కోల్పోయామని తమిళ సినీ ప్రముఖులు చెబుతున్నారు. తమిళంలో పాపులర్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న తవసి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇటీవల ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తెలిసి హాస్పిటల్ చికిత్స కోసం విజయ్‌ సేతుపతి లక్ష రూపాయలు సహాయం అందించారు. ఇక శివకార్తికేయన్‌ రూ.25వేలు, మరో కమెడీయన్‌ సూరి రూ.20వేలు అందించారు.