ప్రముఖ నటి చిత్ర సూసైడ్

తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముట తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. నజరేత్ పేట్టైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు ఈ విషాద సంఘటన కలకలం రేపుతోంది. టీవీ పరిశ్రమకు ఈ వార్త షాక్ ఇచ్చింది. ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె సూసైడ్ చేసుకోవవడానికి కారణం ఏంటనే దానిపై అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆమె వయస్సు 28 సంవత్సరాలు.

CHITRA

ఆమెకు కొద్దిరోజుల క్రితమే వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం పూర్తైంది. దీంతో కొంతకాలంగా కాబోయే భర్తతో కలిసి ఉంటుంది. ఈవీపీ ఫిల్మ్ సిటీలో మంగళవారం షూటింగ్ పూర్తిచేసుకుని హోటల్ రూమ్‌కి తిరిగి వచ్చారని, ఆ తర్వాత ఇవాళ తెల్లవారుజామున ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందిందని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆమె పాండియన్ స్టోర్స్ సీరియల్‌తో బిజీగా ఉంది. ముల్లై పాత్ర ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇక 2019 లో వచ్చిన విజయ్ టీవీ యొక్క వసూల్ వెట్టైకి హోస్ట్ గా వ్యవహరించింది. చిత్ర ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.