నిహారికకు చిరంజీవి భారీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక ఇవాళ జోన్నలగడ్డ చైతన్యను పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఖరీదైన ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లిలో పాల్గొనేందుకు ఇప్పటికే ఇరు కుటంబుసభ్యులు, బంధువులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా పెళ్లికి హాజరుకానున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు పవన్ కూడా ఉదయ్ పూర్ చేరుకున్నారు.

NIHARIKA

సినిమా ఇండస్ట్రీ నుంచి దాదాపు 150 మంది ప్రముఖులకు ఆహ్వనాలు పంపినట్లు తెలుస్తోంది. మరి వారిలో ఎంతమంది హాజరు అవుతారనేది చూడాలి. ఇక హీరోయిన్లలో లావణ్య త్రిపాఠికి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక పెళ్లికి వచ్చినవారు భారీ గిఫ్ట్ తీసుకొస్తున్నారు. ఈ క్రమంతో నిహారికకు చిరంజీవి భారీ గిఫ్ట్ ఇచ్చారు. నిహారిక కోసం రూ.2 కోట్ల విలువైన వజ్రాల హారాన్ని చిరంజీవి గిఫ్ట్‌గా ఇచ్చారు.నిహారిక మెహందీ ఫంక్షన్‌లో ఆ గిఫ్ట్‌ను చిరంజీవి, సురేఖ కలిసి నిహారికకు అందించారు.

అలాగే వరుడు చైతన్యకు కూడా ఒక ఖరీదైన గిఫ్ట్‌ను అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిహారిక సంగీత్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కలిసి ఉన్న ఫొటోలను పాటు నిహారిక, చైతన్యల డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.