Bollywood: బ్యూటీ తాప్సీ ‘లూప్‌ల‌పేటా’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Bollywood: తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం లూప్‌ల‌పేటా. ఈ చిత్రంలో తాప్సీ స‌వి అనే పాత్ర‌ను పోషించ‌నుంది. ఇందులో ఆమె ప్రియుడుగా తాహిర్ రాజ్ భాసిన్ క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రాన్ని జ‌ర్మ‌న్ చిత్ర‌మైన ర‌న్ రోలా ర‌న్ నుంచి ఇది బాలీవుడ్ రీమేక్‌గా వ‌స్తోంది.

Looplaapeta

ఈ Bollywood చిత్రానికి ఆకాశ్ భాటియా ద‌ర్శ‌క‌త్వంలో కామిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై ఎంతో ఆతృత‌గా చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు Bollywood చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రంలో తాప్సీ వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నుంది.