Arjunreddy Director: బోల్డ్ డైరెక్ట‌ర్ మ‌రో మూవీ..

Arjunreddy Director: అర్జున్ రెడ్డితో డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా బాలీవుడ్‌లో క‌బీర్‌సింగ్‌గా తెర‌కెక్కించారు. ఈ చిత్రం అక్క‌డా కూడా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో కాగా, బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించారు. దీంతో వీరిద్ద‌రితో పాటు డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డికి సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌తో కుర్ర‌కారును పిచ్చేక్కించేలా చేశాయి. డ్ర‌గ్స్‌, అడ‌ల్ట్ వంటి సీన్స్ థియేట‌ర్ల‌లో యువ‌త‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి.

animal Movie

కాగా ఈ బోల్డ్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి మ‌రో బాలీవుడ్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. Arjunreddy Director క‌బీర్ సింగ్ నిర్మాత‌ల‌తోనే త‌న సినిమాను రూపొందించ‌నున్నాడు. కానీ ఈ సారి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌ను రూపొందించ‌నున్నాడు సందీప్‌రెడ్డి. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించ‌గా.. అనీమ‌ల్ అనే టైటిల్‌ను నిర్ణ‌యించాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప‌రిణీతి చోప్రా, కీల‌క పాత్ర‌లోఅనిల్ క‌పూర్ కూడా న‌టిస్తున్నాడు. ఈ Arjunreddy Directorచిత్రాన్ని టీ సిరీస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతుంద‌ని స‌మాచారం.